ప్రయాగ కుంభమేళాలో ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ప్రయాగలో కొన్ని కోట్లమంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. సెలబ్రిటీస్, సామాన్య ప్రజలు, ఇతర దేశాల వారు ఇలా పుణ్య స్నానాల కోసం కుంభమేళాకు వెళుతున్నారు. ఫెస్టివల్స్ అప్పుడు భక్తులు మరీ పోటెత్తుతున్నారు. ఒకొనొక సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు.
రోజు రోజుకి కుంభమేళాకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా వరకు అక్కడ ప్రయాగకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించి వచ్చారు. అయితే కుంభమేళాకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో నిన్న ప్రయాగ పరిసర ప్రాంతాల్లో భారీగా కాదు కనీవిని ఎరుగని రీతిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అంటున్నారు. దాదాపుగా 300కి.మీ. మేర నిలిచిన వాహనాలు.. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఓ భక్తుడు ఆవేదన చెందుతూ వదిలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి 300 కిలోమీటర్లు అంటే దాదాపుగా హైదరాబాద్-విజయవాడ మధ్య రహదారి అంత ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రస్తుతం కుంభమేళా చుట్టుపక్కల పరిస్థితి అంత దారుణంగా తయారైంది అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.