Advertisementt

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ట్విస్ట్

Mon 10th Feb 2025 09:13 PM
sankranthki vadtunnam  సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ట్విస్ట్
Sankranthki Vadtunnam coming soon in Zee Telugu సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ట్విస్ట్
Advertisement
Ads by CJ

విక్టరీ వేంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో దుమ్మురేపే కలెక్టన్స్ తో అద్దరగొట్టేసింది. జనవరి 14 న విడుదలైన ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ తో వెంకటేష్ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్-మీనాక్షి చౌదరి-ఐశ్వర్య రాజేష్ లు కలిసి నటించిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు. 

థియేటర్స్ లో బిగ్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిటింగ్ లో ఉండగా.. ఈ చిత్ర ఓటీటీ హక్కులను కొనేసిన జీ 5 ఈ వారంలో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ ప్రకటించింది. కానీ డేట్ లాక్ చెయ్యలేదు. 

దాంతో రేపో మాపో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ 5 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో జీ 5 వారు బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగు అంటే బుల్లితెర మీదకి తీసుకురాబోతున్నారు. జీ 5 నుంచి ఈ వారంలో వస్తుంది అన్నా ఖచ్చితంగా డేట్ ఇవ్వలేదు. 

కానీ ఇప్పుడు బుల్లితెర మీద మాత్రం సంక్రాంతికి వస్తున్నాం కమింగ్ సూన్ అంటూ ప్రకటించడం పై ఆడియన్స్ లో కాస్త గందరగోళం నెలకొంది. 

Sankranthki Vadtunnam coming soon in Zee Telugu:

Sankranthki Vadtunnam OTT details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ