లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైలా మూవీకి కష్టాలు తెచ్చేలా ఉంది. లైలా మూవీ మరో నాలుగు రోజుల్లో విడుదలవుతున్న సందర్భంలో లైలా మూవీని చూడొద్దు అంటూ ఓ రాజకీయ పార్టీ పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. లైలా ఈవెంట్ లో జరిగిన పరిణామం వైసీపీ పార్టీని బాగా హర్ట్ చేసింది.
30 ఇయర్స్ పృథ్వీ లైలా ఈవెంట్ లో 150 గొర్రెలు, ఇప్పుడు 11 గొర్రెలు అయ్యాయి అంటూ వైసీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. గతంలో వైసీపీ లో ఉండి.. తనని పట్టించుకోవడం లేదు అంటూ పార్టీ మారి జనసేనలోకి అడుగుపెట్టిన పృథ్వీ అవకాశం ఉన్నప్పుడల్లా వైసీపీ పార్టీపై సెటైర్స్ వేస్తున్నారు.
అలా లైలా ఈవెంట్ లో పృథ్వీ నోరు జారడం ఆ సినిమాకి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు పృథ్వీ మీద కోపాన్ని లైలా మీద చూపించాడనికి సన్నద్ధం అవుతున్నారు. పృథ్వీ సినిమా గురించి మాట్లాడుకోవాలి, కానీ ఓ సినిమా ఈవెంట్ లో రాజకీయాల గురించి కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు, ఇదే రాజకీయ నాయకులు మాట్లాడితే గోల గోల చేస్తారంటూ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో లైలా చిత్రం పై నెగిటివిటి స్టార్ట్ చేసారు.