నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఓటీటీ డేట్ పై అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది. డాకు మహారాజ్ కన్నా రెండు రోజుల ముందు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్పుడే స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. డాకు మహారాజ్ కన్నా రెండు రోజులు తర్వాత విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఈ వారంలోనే స్ట్రీమింగ్ లోకి రానుంది అని ZEE5 ప్రకటించింది .
మరి మధ్యలో విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి మేకర్స్ ఇంకా ఓటెటీ డేట్ లాక్ చెయ్యలేదా, చేస్తే మేకర్స్ ఎందుకు అనౌన్స్ చెయ్యలేదు అనేది నందమూరి అభిమానుల్లో నడుస్తున్న క్యూరియాసిటీ. డాకు మహారాజ్ మేకర్స్ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అంటూ పోస్టర్ వేసి ప్రకటించారు.
థియేటర్స్ లో వర్కౌట్ అయిన డాకు మహారాజ్ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని అందరూ ముఖ్యంగా నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.