కొత్త పెళ్లి కూతురు కీర్తి సురేష్ మెరుపులు సోషల్ మీడియాను దాటి పోవడం లేదు. పెళ్ళై రెండు నెలలవుతుంది. అయినప్పటికీ ఆమె పెళ్లికి సంబందించిన గుర్తులు ఫొటోస్ రూపంలో ఇంకా ఇంకా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా కీర్తి సురేష్ బ్యూటిఫుల్ లుక్ షేర్ చేసింది.
మెరూన్ కలర్ శారీ లో ఒంటినిండా బంగారు ఆభరణాలతో పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి సురేష్ ఇచ్చిన అందమైన ఫోజ్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. కీర్తి సురేష్ ని అలా చూసి ఎంత చక్కగున్నావే అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.
ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం చేసిన అక్క సీరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనుంది