Advertisementt

మంగళవారం 2లో క్యూట్ బ్యూటీ

Sun 09th Feb 2025 10:36 PM
sreeleela  మంగళవారం 2లో క్యూట్ బ్యూటీ
Cute Beauty in Mangalavaram 2 మంగళవారం 2లో క్యూట్ బ్యూటీ
Advertisement
Ads by CJ

సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు ఆసక్తి చూపించారు. అయితే సీక్వెల్‌లోనూ పాయల్ రాజ్ పుత్‌నే కొనసాగిస్తారనుకుంటే ఆమె స్థానంలో కొత్త నటిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా సీక్వెల్‌ కథ మొదటి భాగం ముగిసిన చోట నుంచే కొనసాగుతుందని భావించారు. దీంతో పాయల్‌ పాత్రకూ చోటు ఉంటుందని అంతా ఊహించారు. కానీ అజయ్ భూపతి మాత్రం ఈసారి కొత్త హీరోయిన్‌తో కథను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త నటితో సరికొత్త ఫ్రెష్‌నెస్‌ ఉంటుందని భావిస్తూ పాయల్ స్థానంలో మరో హీరోయిన్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. అజయ్ భూపతి రూపొందించిన కథకు శ్రీలీల పర్ఫెక్ట్‌గా సరిపోతుందన్న అభిప్రాయంతో ఆమెను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు టాక్. శ్రీలీల నటన గ్లామర్‌ రెండూ సరిగ్గా మ్యాచ్ అవుతాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్‌కు జోడీగా నటిస్తుండగా మాస్ జాతర సినిమాలో రెండోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో మంగళవారం సీక్వెల్ కోసం శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? లేదా ? అన్నది వేచి చూడాలి.

మొత్తానికి మంగళవారం సీక్వెల్ కోసం కొత్త హీరోయిన్ ఎంపిక దశలో ఉంది. శ్రీలీల ఫైనల్ అవుతుందా ? లేక మరెవరైనా అవకాశాన్ని దక్కించుకుంటారా ? అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. అజయ్ భూపతి ఈసారి భారీ కాంట్రాస్ట్‌తో మరో థ్రిల్లింగ్ కథ అందించేందుకు రెడీగా ఉన్నాడనేది మాత్రం ఖాయం.

Cute Beauty in Mangalavaram 2:

Sreeleela talks in Mangalavaram 2

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ