గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ లో డిజప్పాయింట్ చెయ్యడంతో నెల తిరిగే లోపు గేమ్ చేంజర్ ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుంచి మేకర్స్ స్ట్రీమింగ్ లోకి తెచ్చేసారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో గేమ్ చెంజర్ అందుబాటులో ఉంది.
బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ది(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. తాజాగా చరణ్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లేందుకు బేగం పేట ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. సింగిల్ గా చరణ్ ముంబై వెళుతూ కనిపించారు.
అయితే చరణ్ ముంబై వెళ్ళింది ఎందుకు అనే విషయంలో మెగా ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఉన్నారు. చరణ్ వెళ్ళింది ISPL 10 మ్యాచ్ కోసం అని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న RC 16 లో జగపతి బాబు, శివరాజ్ కుమార్ లు నటిచడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.