సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించే ఏ నటులైనా మెగాస్టార్ ని చిన్నప్పటి నుంచి చూసి సినిమాల్లోకి వచ్చాం, మాకు మెగాస్టార్ మార్గదర్శం అంటూ చెబుతూ ఉంటారు. చాలామంది హీరోలు, నటులు, దర్శకులు ఇలా ఎక్కువగా మెగాస్టార్ నే పొగుడుతూ ఉంటారు. ఈతరంలో కుర్ర హీరోలు ఏం మాట్లాడినా అది ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అవుతుంది, మనకి ఎంత వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి కామెంట్స్ చేస్తున్నారు.
కుర్ర హీరోలు బాలయ్యతో స్నేహం చేసున్నారు. అందులో బాలయ్యకు అన్ స్టాపబుల్ షో వలన కుర్ర హీరోలతో దోస్తీ కుదిరింది. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలు బాలయ్య అంటే ప్రాణం ఇచ్చేస్తారు. విశ్వక్ తన సినిమా దంకి కి ఇలా కొన్నిట్టికి బాలయ్యను గెస్ట్ గా పిలిచి రచ్చ చేసాడు.
ఇప్పుడు మెగాస్టార్ ని తన సినిమా లైలా ఈవెంట్ కోసమా గెస్ట్ గా పిలిచాడు. బాలయ్యను అప్పుడు వాడేసిన విశ్వ సేన్ ఇప్పుడు ఈరోజు జరగబోయే లైలా ఈవెంట్ కి మెగాస్టార్ ని వాడేస్తున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.