Advertisementt

అందుకే సౌత్ కి గ్యాప్ వచ్చింది-మృణాల్

Sun 09th Feb 2025 11:28 AM
mrunal thakur  అందుకే సౌత్ కి గ్యాప్ వచ్చింది-మృణాల్
Mrunal Thakur opens up about south movies అందుకే సౌత్ కి గ్యాప్ వచ్చింది-మృణాల్
Advertisement
Ads by CJ

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని సౌత్ ప్రేక్షకులు ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. అంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా చూసాక ఆమెని గ్లామర్ పాత్రల్లో సౌత్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అన్నంతగా మృణాల్ సీత కేరెక్టర్ లో హైలెట్ అయ్యింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసిన మృణాల్ ఠాకూర్ కు సౌత్ లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. 

ఈమధ్యనే శృతి హాసన్ తప్పుకున్న డెకాయిట్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది, మరోపక్క కోలీవుడ్ ఆఫర్స్ మృణాల్ కు వస్తున్నాయన్నా వాటిపై క్లారిటీ లేదు, అందుకే మృణాల్ ఠాకూర్ కి సౌత్ అవకాశాలు తగ్గినట్టు ఉన్నాయనే ప్రశ్న ఎదురైంది. దానికి మృణాల్ ఠాకూర్ తన స్టయిల్లో ఆన్సర్ ఇచ్చింది. 

ప్రేక్షకులు తనని కథాబలమున్న పాత్రలో చూడాలనుకుంటున్నారు(మోడ్రెన్ గా, గ్లామర్ గా కాదు) అందువల్ల వారికి నచ్చే కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకునేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాను. ఒక సినిమా చేస్తున్నప్పుడు దానిపై ఫోకస్ పెట్టకుండా వేరే సినిమాల గురించి ఆలోచించే టైప్ కాదు, అందుకే ఈ గ్యాప్ అన్నట్టుగా మృణాల్ ఠాకూర్ అవకాశాల విషయంలో అద్భుతం గా ఆన్సర్ ఇచ్చింది. 

Mrunal Thakur opens up about south movies:

Mrunal Thakur opens up about her struggles in Telugu cinema

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ