Advertisementt

అక్కినేని ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోండి

Sun 09th Feb 2025 08:51 AM
thandel  అక్కినేని ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోండి
Akkineni fans in happy mode అక్కినేని ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోండి
Advertisement
Ads by CJ

కొన్నాళ్లుగా అక్కినేని ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. అటు నాగ చైతన్యకు ఇటు అఖిల్ ఇద్దరూ కెరీర్ లో సఫర్ అవుతున్నారు. నాగార్జున నా సామి రంగ తర్వాత సోలో ప్రోజెక్ట్ అనౌన్స్ చెయ్యలేదు. చైతు వరస వైఫల్యాలతో నిరాశలో ఉన్నాడు. అటు అఖిల్ కెరీర్ లో బిగ్ హిట్ పడలేదు. 

ఇవన్నీ అక్కినేని అభిమానులను డిజప్పాయింట్ అయ్యేలా చేసాయి. కానీ ఇప్పడు అక్కినేని అభినులు రిలాక్స్ అవ్వాల్సిందే. కాదు కాదు అవుతున్నారు. కారణం నాగ చైతన్య లైఫ్ లో సెటిల్ అవడం, కెరీర్ విషయంలో తండేల్ తో హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

గత ఏడాది డిసెంబర్ లో శోభిత ను వివాహం చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిన చైతు గత శుక్రవారం తండేల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. తండేల్ పబ్లిక్ టాక్, తండేల్ రివ్యూస్, తండేల్ ఓపెనింగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉండడం, సోషల్ మీడియాలో తండేల్ కి వస్తోన్న పోజిటివ్ రిపోర్ట్స్ అన్ని అక్కినేని అభిమానులకు ఊరటనిచ్చాయి. 

చైతు తండేల్ తో హిట్టుకొట్టాడు, అదే సక్సెస్ ని అఖిల్ కూడా కంటిన్యూ చెయ్యాలనేది అభిమానుల కోరిక. 

Akkineni fans in happy mode:

Akkineni fans are relaxing with Thandel success

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ