గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం RC16. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. ఈ సినిమా ఒక శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం.
ఇప్పటి వరకు ఈ సినిమా ఏ క్రీడ ఆధారంగా ఉంటుందనే విషయంలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి సంబంధించిన చిన్న క్లూ ఇచ్చారు. పవర్ క్రికెట్ అని పేర్కొంటూ షూట్‌పై ఓ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో సాగుతుందని అర్థమవుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక అద్భుతమైన క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ సీక్వెన్స్‌లు హై వోల్టేజ్ యాక్షన్‌తో ఉండనున్నాయట. చరణ్ చేతితో బ్యాట్ పడితే బాల్ స్టేడియం బయటకి వెళ్లిపోవడం ఖాయం అనే రేంజ్‌లో ఉంటుందని సమాచారం. ఇటీవల షెడ్యూల్‌లో ఒక పవర్‌ఫుల్ బ్యాటింగ్ సీన్ ఇప్పటికే షూట్ చేసినట్లు టాక్.
ఇంత క్రేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ ఈసారి ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.