విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల మధ్య ఏం నడుస్తుందో తెలియదు కానీ.. వాళ్లిద్దరూ తరచూ వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక కనిపించడం, ఇద్దరూ కలిసి జిమ్ చేయడం, ఫారెన్ టూర్స్ వేయడం వంటివి చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనేలా వార్తలు అయితే అస్సలు ఆగడం లేదు.
పోనీ ఈ వార్తలని ఏమైనా ఖండిస్తున్నారంటే అదీ లేదు. ఇన్ డైరెక్ట్‌గా మేమిద్దరం కలిసే ఉంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నామనేలా ఇంకాస్త హింట్ ఇచ్చేస్తున్నారు. మరి పెళ్లి చేసుకుంటారో, లేదో తెలియదు కానీ.. ఇద్దరూ మాత్రం ఎప్పటికప్పుడు దొరికిపోతూనే ఉన్నారు. అలాగే వీరిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చుకునే సపోర్ట్ కూడా వార్తలలో బాగా హైలెట్ అవుతుంది. ప్రస్తుతం సినిమాల పరంగా కాస్త డౌన్‌లో ఉన్న విజయ్ దేవరకొండకు సక్సెస్‌లతో దూసుకెళుతున్న రష్మిక సపోర్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ చేస్తున్న VD12 చిత్రానికి రష్మిక బాలీవుడ్ పరంగా హెల్ప్ చేస్తున్నట్లుగా సమాచారం. ఫిబ్రవరి 12న ఈ చిత్ర టీజర్ విడుదల కాబోతోంది. ఈ టీజర్‌కు యానిమల్ స్టార్ రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చేలా రష్మిక ఒప్పించినట్లుగా సమాచారం. యానిమల్‌లో రణ్‌బీర్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.