మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఈ నెల 14న ప్రేమికుల రోజు స్పెషల్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే విశ్వక్ సేన్ అనగానే నందమూరి ఫ్యామిలీకి వీరవిధేయుడు అనేలా టాక్ ఉంది. అలాంటిది తన సినిమా ఈవెంట్‌కు మెగా హీరోని ముఖ్య అతిథిగా పిలవడం చర్చనీయాంశం అయ్యింది.
ఇదే విషయాన్ని ఉండబట్టలేక ఓ మీడియా పర్సన్.. మీరు నందమూరి హీరోలను ఇష్టపడతారు. వారితో ఈ మధ్య పార్టీలు, కిస్‌లు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడేంటి సడెన్‌గా బాస్‌ని మీ సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా తీసుకొస్తున్నారు. మీరు కాంపౌండ్ మార్చారా? అంటూ ప్రశ్నించాడు. దీనికి మాస్ కా దాస్ పెద్ద క్లాసే ఇచ్చి.. ఇచ్చిపడేశాడంతే.
మాకంటూ ఉన్నది ఒక్కటే కాంపౌండ్.. అది మా ఇంటికి మాత్రమే ఉంది. అయినా కాంపౌండ్‌లు అంటూ మాకేం ఉండవ్.. అవి ఉండేది మీకు. సినిమా ఇండస్ట్రీలో అలాంటివేమీ లేవు. మేమంతా ఒక్కటే. బాస్ ఈజ్ బాస్.. మమ్మల్ని అభిమానించే వారు ఎలా అయితే ఉంటారో మేము అభిమానించే వాళ్లు కూడా అలానే ఉంటారు. తెలుసు కదా.. అని ప్రతిసారి వాళ్లని ఇబ్బంది పెట్టలేం.
ఒక స్టార్ హీరోని ఈవెంట్‌కి పిలవడానికి 100 కారణాలుంటాయ్. నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా ఏదో ఒక రూపంలో బంధాలుంటాయ్. అయినా మా నాన్నకు, మెగాస్టార్‌కు పాలిటిక్స్ నుండి పరిచయం ఉంది. మా నాన్న అప్పట్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. మెగాస్టార్‌గారు మా శ్రేయోభిలాషి. దయచేసి మాకు కాంపౌండ్‌లు కట్టొద్దు. మీడియా చేయాల్సింది అది కాదు.. మంచిగా ఆలోచించండి.. అంతా మంచిగానే కనిపిస్తుందంటూ విశ్వక్ క్లాస్ తీసుకున్నాడు.