ఏ మాయ చేసావే సినిమా తర్వాత చైతూ, సమంత ప్రేమలో పడి, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి, ఇరు కుటుంబాల అంగీకారంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఎంతో ప్రేమగా కలిసున్న ఆ జంట.. కారణం తెలియదు కానీ.. విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరి సినిమాలతో, ఎవరి పనులతో వారు బిజీబిజీగా ఉంటున్నారు. మధ్య మధ్యలో సమంత కాస్త అగ్రెసివ్ అవుతూ.. వారి విడాకుల బంధంపై మాట్లాడింది తప్పితే.. చైతూ మాత్రం ఇంత వరకు ఎక్కడా వారి విడాకులపై మాట్లాడలేదు.
ఫస్ట్ టైమ్ సామ్‌తో విడాకులపై నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న నాగ చైతన్యకు డివోర్స్ విషయమై ప్రశ్న ఎదురైంది. ఈ మధ్య రెండో పెళ్లిగా శోభితను పెళ్లాడిన చైతూ.. సామ్‌తో విడాకులపై నేను బ్రోకెన్ ఫ్యామిలీ నుండే వచ్చాను అంటూ ఎమోషనల్‌గా స్పందించాడు. డివోర్స్‌పై చైతూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నా లైఫ్‌లో ఏం జరిగిందో అది ఇప్పటి వరకు చాలా మంది జీవితాలలో జరిగిందే. కేవలం నేనొక్కడినే విడాకులు తీసుకోలేదు. నాకంటే ముందు చాలా మంది విడాకులు తీసుకున్నారు. కానీ నేనే ఏదో పెద్ద తప్పు చేసినట్టు, నన్ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఎందుకు క్రిమినల్‌గా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు? ఈ విషయంలో నేను ఎవరినైనా డిజప్పాయింట్ చేసి ఉంటే క్షమించండి. ఒక రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయాలంటే ఒకటికి 1000 సార్లు నేను ఆలోచిస్తాను.
ఎందుకంటే, దాని వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో, సమాజం ఎలా తీసుకుంటుందో నాకు తెలుసు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చినవాడినే. కాబట్టి దాని గురించి నాకు బాగా తెలుసు. నా లైఫ్‌లో అలా జరిగినందుకు నిజంగా బాధగానే ఉంది. కానీ అది ఇద్దరి అంగీకారంతోనే జరిగింది. మేమిద్దరం మా దారులలో మేం నడుస్తున్నాము. అది జరిగి కూడా చాలా కాలం అవుతుంది.
అయినా కూడా ఇంకా హెడ్‌లైన్స్‌గా మీడియానే హైలెట్ చేస్తుంది. డివోర్స్ గురించి చాలా ఆలోచించాను. నేను ఎక్కడ మాట్లాడితే ఏం రాస్తారో అనే దానిలోనే ఉండిపోయాను. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం.. ఇంకా మమ్మల్ని ఊహించుకుని వార్తలు సృష్టించేవారు ఫుల్ స్టాప్ పెడితేనే అది జరుగుతుంది అంటూ చైతూ ఫస్ట్ టైమ్ డివోర్స్‌పై ఓపెన్ అయ్యాడు. అయితే అసలు ఏం జరిగిందనేది మాత్రం చైతూ కూడా చెప్పలేదు.