అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ విడుదలవుతున్నా లెక్క చెయ్యకుండా, ఎటువంటి టెన్షన్ పడకుండా కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని దించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దానితో అనిల్ రావిపూడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక అనిల్ రావిపూడి తదుపరి చిత్రాన్ని మెగాస్టార్‌తో చెయ్యబోతున్నాడు. ఇది కూడా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిరుకి సరితూగే కామెడీతోనే సినిమాని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. చిరు విశ్వంభర విడుదలకు ముందే అనిల్ రావిపూడి-చిరుల కాంబో పై అధికారిక ప్రకటన మాత్రమే కాదు.. పూజా కార్యక్రమాలతో సినిమా కూడా మొదలయ్యే ఛాన్స్ ఉందని తాజా సమాచారం.
మరోవైపు ఈ ఏడాది మొదలు కాబోయే చిరంజీవి-అనిల్ రావిపూడిల చిత్రం ఈ ఏడాదిలోనే షూటింగ్ ముగించేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్‌లో దిల్ రాజు కూడా ఉన్నారట. ఈ వార్తలు చూశాక ఏమయ్యా దిల్ రాజు.. సంక్రాంతిని వదలవా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.