టిల్లు సిరీస్ చిత్రాలతో హీరోగా ఇమేజ్‌ని పెంచుకుంటూ పోతున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. మొదటి పార్ట్‌లో నేహా శర్మని, రెండో పార్ట్‌లో అనుపమ పరమేశ్వరన్‌ను పటాయించితే.. ఇప్పుడు రాబోయే సినిమాలో ఏకంగా ఇద్దరు బ్యూటీలను పటాయిస్తున్నాడు. అర్థం కాలేదు కదా. మ్యాటర్ ఏంటంటే..
సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలుసు కదా. ఈ సినిమా పేరే తెలుసు కదా. శుక్రవారం సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర టీమ్ రెండు న్యూ స్టిల్స్‌ని వదిలింది. ఒక్కో స్టిల్‌లో ఒక్కో హీరోయిన్‌తో సిద్ధు రొమాన్స్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరనుకుంటున్నారు?
ఈ స్టిల్స్‌లో మొదటి స్టిల్‌లో కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో రొమాంటిక్ గేమ్ ఆడుకుంటున్న సిద్ధు.. రెండో స్టిల్‌లో రాశీ ఖన్నాతో నుదిటిపై ముద్దు పెట్టించుకుంటున్నాడు. మరి ఇద్దరితో ఈ టిల్లు బాయ్ ఎలా ప్రేమకథ నడిపి ఉంటాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.