యువసామ్రాట్ నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తండేల్ చిత్రం గ్రాండ్‌గా నేడు (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తలలో ఉంటూనే ఉంది. ప్రమోషన్స్ పరంగా టీమ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి కూడా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొని సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేశారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ట్విట్టర్ ఎక్స్‌లో రివ్యూస్ వచ్చేశాయి.
దేశభక్తితో ముడిపెట్టి అల్లిన లవ్ స్టోరీ ఇది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే.. సాయి పల్లవి మరోసారి తన సత్తా చాటింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో సినిమాను నిలబెట్టేశాడు. డీఎస్పీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి బలంగా నిలిచాయి. కాకపోతే కాస్త స్లో నేరేషన్, పాకిస్తాన్ ఎపిసోడ్స్ సినిమాకు మైనస్‌గా మారాయి కానీ.. చైతూ నటన కోసం ఈ సినిమాను చూసేయవచ్చు అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయం చెప్పాడు.
మరో నెటిజన్.. తండేల్ సినిమాకు నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్. ఫస్టాఫ్ ఓకే. సెకాండాఫ్ మాత్రం సాలిడ్‌గా ఉంది. కాకపోతే రైటింగ్ చాలా వీక్‌గా ఉంది. కార్తికేయ 2 వంటి సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ నుండి ఇలాంటి సినిమా అస్సలు ఊహించలేదు. ఆ విషయంలో మాత్రం కాస్త డిజప్పాయింట్ చేసింది అంటూ రాసుకొచ్చాడు. మొత్తంగా అయితే ట్విట్టర్ ఎక్స్‌లో ఈ సినిమాపై పాజిటివ్ అభిప్రాయాలే వస్తున్నాయి. 2.75 నుండి 3 వరకు నెటిజన్లు రేటింగ్ ఇస్తున్నారు. అంటే, చైతూ తండేల్‌గా దుల్లకొట్టేసినట్లే.