గేమ్ చేంజర్ కోసం రెండున్నరేళ్లు త్యాగం చేసిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వకముందే RC 16 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. పెద్ద ఎత్తున బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం ప్లాన్ చేసుకుని పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ లోకి వెళ్ళాడు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చెయ్యడం దగ్గరనుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ ను తీసుకోవడం, అలాగే కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ను విలన్ గా సెట్ చెయ్యడం వరకు అన్ని బిగ్ ప్లాన్ అనే చెప్పాలి.
ఇక రంగస్థలంలో రామ్ చరణ్ కి సుకుమార్ ఓ లోపాన్ని పెట్టి దానిని ఆడియన్స్ కు బాగా రిచ్ అయ్యేలా చెయ్యడమే కాదు పాత్రకు ఆ లోపం కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఇప్పుడు బుచ్చిబాబు కూడా చరణ్ కోసం అలాంటి లోపమోకటి పెట్టబోతున్నాడని తెలుస్తోంది.
దానితో నడిపించిన డ్రామా కథని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తుందని, అంతేకాకుండా RC 16 క్లైమాక్స్ ను కూడా వేరే లెవల్లో బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని, గురువు గారు సుకుమార్ రంగస్థలం క్లైమాక్స్ లోలా ఉప్పెనలో కూడా బుచ్చిబాబు బలమైన క్లైమాక్స్ పెట్టినట్టుగానే RC 16 లోను అదిరిపోయే క్లైమాక్స్ ను సెట్ చేస్తున్నాడట. మరి ఇవి వింటుంటే మెగా ఫ్యాన్స్ కు ఆనందం కాక ఇంకేముంటుంది.