నాగ చైతన్య-సమంత తమ ప్రేమ, పెళ్లి జీవితానికి విడాకులతో ఎండ్ కార్డు వేశారు. నాగ చైతన్య-సమంత విడిపోయాక.. చైతు చాలా రోజులు సైలెంట్ గానే ఉన్నప్పటికి చాలా త్వరగా లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యి హీరోయిన్ శోభిత దూళిపాళ్లను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. సమంత కెరీర్ లో బిజీ అవుతూనే మాయోసైటిస్ తో పోరాడుతుంది.
మరోపక్క సమంతకు నాగ చైతన్య రెండో పెళ్లిపై తరచూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. సిటాడెల్ ప్రమోషన్స్ సమయంలో మీరు ఎక్కువగా దేనికి ఖర్చుపెట్టారు అని అడగగానే.. నా మాజి కోసం కాస్ట్లీ గిఫ్ట్స్ కొన్నప్పుడు, ఎంత ఖర్చు పెట్టారు అంటే చాలా ఎక్కవే అని చెప్పింది సమంత.
తాజాగా సమంత కు ఓ ఇంటర్వ్యూలో మీ మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టినందుకు మీరు ఏమైనా అసూయ పడుతున్నారా అని అడగగానే.. నా లైఫ్ లో అసూయకు చోటు లేదు, నా జీవితంలో అలాంటి మాటకు తావు లేదు. అసూయే అన్ని చెడులకు మూలమని నమ్ముతాను అంటూ చైతు సెకండ్ మ్యారేజ్ పై సమంత ఇలా స్పందించింది.