గత ఏడాది రాజ్ తరుణ్ మాజీ భార్య లావణ్య కేసు మీడియాలోనే కాదు, పోలీసుల్లోను హాట్ టాపిక్ గా నడిచింది. లావణ్య.. రాజ్ తరుణ్ తనని వదిలేసి మరో హీరోయిన్ తో ఎఫ్ఫైర్ పెట్టుకున్నాడు అంటూ ఆమె కేసు పెట్టి మీడియా కెక్కింది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆతర్వాత మస్తాన్ సాయి ఫోన్ కాల్స్ లీకయ్యాయి. లావణ్య మస్తాన్ సాయిపై పెట్టిన కేసు సంచలనంగా మారింది.
మస్తాన్ సాయి పేరు డ్రగ్స్ విషయంలోనూ హైలెట్ అయ్యింది. తాజాగా మస్తాన్ సాయి లావణ్య ప్రవేట్ వీడియోస్ ని చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కేసు విషయమై మస్తాన్ సాయి ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్న మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రూవ్ అయ్యింది. అంతేకాదు గతంలో డ్రగ్స్ తీసుకుని లావణ్య ఇంటికి వచ్చి గొడవ చేసినట్లుగా పేర్కొన్నారు, రాజ్ తరుణ్ మస్తాన్ సాయి-లావణ్య మధ్యలో గొడవ సెటిల్ చేసి మస్తాన్ సాయి దగ్గర ఉన్న లావణ్య వీడియోస్ ని డిలేట్ చేయించి రాజీ కుదర్చగా.. ఈలోపే మస్తాన్ సాయి ఆ వీడియోస్ ని వేరే డివైజ్ లో కాపీ చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
2022 లో అక్టోబర్ లో ఓ పార్టీ లో లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలోను లావణ్య వీడియోస్ సీక్రెట్ గా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడడమే కాదు, హార్డ్ డిస్క్ కోసం లావణ్యను మస్తాన్ సాయి చంపబోయినట్లుగా విచారణలో మస్తాన్ సాయి ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదంతా చూసి లావణ్య పై మస్తాన్ సాయి అరాచకాలు ఇన్నా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.