నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ రేపు శుక్రవారమే విడుదలకాబోతుంది. థాంక్యూ, కస్టడీ చిత్రాల తర్వాత చైతు నుంచి రాబోతున్న మూవీ తండేల్, దూత వెబ్ సీరీస్ తో సక్సెస్ అందుకున్నా నాగ చైతన్య తండేల్ తో హిట్ కొట్టాలని కసి గా కనిపిస్తున్నాడు. తండేల్ కోసం భాష నేర్చుకుని, లుక్ మార్చుకుని గత రెండేళ్లుగా కష్టపడుతున్నాడు.
నాగ చైతన్య-సాయి పల్లవి కెమిస్ట్రీ తండేల్ కి ప్లస్ అవుతుంది అందడంలో సందేహం లేదు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి నుంచి వస్తున్న తండేల్ పై విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. తండేల్ బుకింగ్ జోరు కనిపిస్తుంది. రీసెంట్ గానే ఓపెన్ అయిన తండేల్ బుకింగ్స్ హుషారుగా ఉన్నాయి.
బుక్ మై షోలో తండేల్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. టికెట్స్ తెగుతున్నాయి. ఇప్పటికే మల్టిప్లెక్స్ లు టికెట్స్ ఆల్మోస్ట్ ఫుల్ అయ్యాయి, సింగిల్ స్క్రీన్ బుకింగ్స్ లోను తండేల్ జోరు కనిపిస్తుంది. ఈ లెక్కన తండేల్ ఓపెనింగ్స్ లో బిగ్ నెంబర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.