బాలీవుడ్ క్యూటీ అలియా భట్ అందాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చక్కటి ఫిగర్ ని మైంటైన్ చేస్తూ ఫిట్ గా గ్లామర్ గా కనిపించడమే కాదు.. ఎయిర్ పోర్ట్ లుక్ లోను బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది రాహా కు తల్లయ్యింది. అయినా అలియా లో ఇసుమంతైనా మార్పు లేదు.
అదే అందం, అదే ఫిట్ నెస్. ఆర్.ఆర్.ఆర్ తో సౌత్ కి ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ దేవరతోను సౌత్ లో నటించాల్సి ఉంది. కానీ అది తృటిలో మిస్ అయ్యింది. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అలియా భట్ తాజాగా షేర్ చేసిన పిక్ చూస్తే అజంతా శిల్పమా అన్నట్టుగా ఉంది.
గోల్డ్ కలర్ మోడ్రెన్ డ్రెస్సులో అలియా అందాలు అలవోకగా ఎక్స్పోజ్ అయ్యాయి. మెడలో వజ్రాభరణాలతో మెరిసిన అలియా భట్ అందం గురించి ఎంత పొగిడినా తక్కువే.