పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సెట్స్ మీదకి వెళతారా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూడని క్షణము లేదు. అసలైతే జనవరిలో సంక్రాంతి తర్వాత స్పిరిట్ మొదలు కావాల్సి ఉంది. కానీ అది ఇప్పుడు మే వరకు జరిగింది అనే వార్తల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
తాజాగా ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రాన్ని మార్చ్ లో ఉగాది రోజున ముహూర్త కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న స్పిరిట్ హంగామా మార్చి ఉగాది నుంచి మొదలు కానున్నట్లుగా సమాచారం.
తనతో పని చేసే హీరోలను అభిమానుల అంచనాలకు మించి డిజైన్ చేసే పాత్రల్లో చూపించే సందీప్ రెడ్డి వాంగ్ ప్రభాస్ ను పోలిస్ ఆఫీసర్ గా ఎలాంటి లుక్ లో ప్రెజెంట్ చేస్తాడో అనే క్యూరియాసిటీ ప్రభాస్ ఫ్యాన్స్ లో నడుస్తుంది.