కొన్నాళ్లుగా సౌత్ లో కనిపించని సమంత హిందీలో మాత్రం తన ప్రత్యేకతను చూపించేందుకు తహతహలాడుతోంది. సీరీస్ ల్లోనే కాదు.. బయట కూడా బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గ్లామర్ ఫొటోస్ తో మతి పోగొడుతుంది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను షేర్ చేసింది.
అవి చూడగానే నయా లుక్ లో సమంత అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. ఒక మ్యాగజైన్ కోసం సమంత ఇలాంటి వెరైటీ లుక్ లోకి మారిపోగా.. సమంతను అలా కొత్త లుక్ లో చూడగానే సౌత్ లో చూసి చాలా కాలమైంది అంటూ దిగులు పడుతున్నారు. ఇక సమంత సిటాడెల్ దర్శకులతో మరో సీరిస్ చెయ్యడమే కాదు నిర్మాతగానూ సినిమాలు నిర్మిస్తోంది.
ఈమధ్యన ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ తో సమంత చెట్టాపట్టాలుసుకుని తిరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. సమంత-రాజ్ డేటింగ్ లో ఉన్నారనే రూమార్స్ కి సమంత చెక్ పెడుతుందా, లేదంటే షాకిస్తుందా అని చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.