సంక్రాంతి జోరు ఇంకా సన్నగిల్లకుండానే ఈ వారం తెలుగు సినిమా రంగం మరిన్ని సర్‌ప్రైజ్‌లకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నాగచైతన్య నటించిన తండేల్ సినిమాపైనే అందరి దృష్టి ఉంది.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమ కథాంశం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ. ముఖ్యంగా బుజ్జితల్లి, హైలెస్సా వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాయి పల్లవి కుటుంబ ప్రేక్షకులకు నచ్చే నటి కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి.
అజిత్ నటించిన పట్టుదల సినిమా కూడా ఈ వారం విడుదల కానుంది. అజిత్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతున్నప్పటికీ తండేల్ సినిమాపై ఉన్న అంచనాల మాత్రం కొంచెం ఎక్కువే.
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక పథకం ప్రకారం సినిమా కూడా ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా విలన్ ఎవరో ఊహించిన వాళ్లకు పది వేలు ఇస్తామంటూ చేస్తున్న వినూత్న ప్రచారం ఆకర్షణీయంగా ఉంది. అయితే తండేల్, పట్టుదల సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ పెద్దగా లేవు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తండేల్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయి పల్లవి కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే నటి కావడం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చందూ మొండేటి దర్శకత్వం వంటి అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. పట్టుదల, ఒక పథకం ప్రకారం సినిమాల విషయానికి వస్తే ఈ రెండు సినిమాల విజయం మౌత్ టాక్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ వారం తెలుగు సినిమా రంగం చాలా బిజీగా ఉంది. ప్రేక్షకులకు మూడు వేర్వేరు రకాల సినిమాలు అందుబాటులో ఉండటంతో ఈ వారం సినిమా రంగం ఎలా ఉంటుందో చూడాలి.