కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారనగానే అందరిలో విపరీతమైన ఆసక్తి, పాన్ ఇండియా మార్కెట్ లో కన్నప్ప పై అంచనాలు స్టార్ట్ అయ్యాయి. మంచు విష్ణు ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం కన్నప్పలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు నటించడం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భాగమవడంతో కన్నప్పపై క్రేజ్ ఎక్కువైంది.
గత వారం రోజులుగా ప్రభాస్ కన్నప్ప లుక్ పై మేకర్స్ వదులుతున్న ప్రీ లుక్ పోస్టర్స్ ప్రభాస్ లుక్ పై అంచనాలు పెంచేసాయి. ఈరోజు ఫిబ్రవరి 3 న కన్నప్పలో ప్రభాస్ రుద్రగా కనిపించనున్నట్టుగా పోస్టర్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.
ప్రళయ కాల రుద్రుడు!
త్రికాల మార్గదర్శకుడు!!
శివాజ్ఞ పరిపాలకుడు!!!
అంటూ ప్రభాస్ లుక్ ని వదలగానే.. రుద్రా గా ప్రభాస్ దర్శనం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. మెడ నిండా రుద్రాక్ష మాలలతో, అచ్చం శివుడి మాదిరి రుద్రగా ప్రభాస్ లుక్ మాత్రం అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్స్ చెయ్యడం ఖాయం. మరి ప్రభాస్ లుక్ తర్వాత కన్నప్ప పై ఏ స్థాయిలో అంచనాలు పెరుగుతాయో చూడాలి.