పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈ సినిమా నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తవ్వలేదు. ఇదే సమయంలో పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో వంటి సినిమాలు పూర్తి చేసినప్పటికీ హరిహర వీరమల్లు మాత్రం అనేక కారణాల వల్ల నిలిచిపోతోంది.
ఇక షూటింగ్ ఆలస్యం కావడంతో మేకర్స్ మరింత టెన్షన్‌కు గురవుతున్నారని సమాచారం. మరోవైపు రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమా పూర్తయ్యే ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల డేట్స్ ఇచ్చినట్లయితే ఆయన భాగం పూర్తి అవుతుందని అంటున్నారు. అయితే ఈ డేట్స్ ఎప్పుడు ఇస్తారనే విషయంలో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
పవన్ షెడ్యూల్ కుదిరితేనే హరిహర వీరమల్లు అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మరోసారి సినిమా వాయిదా పడే ప్రమాదం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా విడుదలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.