Advertisementt

SSMB29 నుంచి బ్రేక్ తీసుకున్న ప్రియాంక

Sun 02nd Feb 2025 07:26 PM
priyanka chopra  SSMB29 నుంచి బ్రేక్ తీసుకున్న ప్రియాంక
Priyanka Chopra takes a break from the SSMB29 shoot SSMB29 నుంచి బ్రేక్ తీసుకున్న ప్రియాంక
Advertisement
Ads by CJ

మహేష్-రాజమౌళి కాంబోలో రీసెంట్ గా మొదలైన పాన్ ఇండియా ప్రోజెక్ట్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది అనేది యూనిట్ కన్ ఫర్మ్ చెయ్యకపోయినా.. ఆమె హైదరాబాద్ రావడం, ఇండైరెక్ట్ గా SSMB 29 పై పోస్ట్ లు పెట్టడం తో ఆ విషయాన్నిఅందరూ కన్ ఫర్మ్ చేసుకున్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ లో ఉండి, రాజమౌళి-మహేష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది ప్రియాంక. 

తాజాగా SSMB 29 షూటింగ్ నుంచి ప్రియాంక చోప్రా చిన్న బ్రేక్ తీసుకుని ముంబై వెళ్లిన ఎయిర్ పోర్ట్ వీడియోస్ వైరల్ అయ్యాయి. అయితే రాజమౌళి సినిమా నుంచి ప్రియాంక బ్రేక్ తీసుకోవడానికి కారణం ఆమె సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహం ముంబై లో జరుగుతూ ఉండడంతో ప్రియాంక చోప్రా SSMB 29 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఆమె రాజమౌళి సినిమాలో నటిస్తుంది అనే ప్రచారం మొదలయ్యాక ప్రియాంక చోప్రాపై సౌత్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆమెని తెగ హైలెట్ చేస్తుంది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్టుగా గుసగుసలు మొదలయ్యాయి. 

Priyanka Chopra takes a break from the SSMB29 shoot:

Priyanka Chopra on a break from SSMB29

Tags:   PRIYANKA CHOPRA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ