నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నిర్మాత అరవింద్, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు చందుతో పాటుగా చైతు పలు ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య వైఫ్ శోభిత తన భర్త విషయంలో తనని ఓ కోరిక కోరింది అంటూ సరదాగా కామెంట్స్ చేసారు.
చైతు పెళ్ళికి వెళ్ళినపుడు శోభితకు నన్ను పరిచయం చెయ్యగా.. శోభిత మా ఆయన గెడ్డం ఎప్పుడు తీస్తారు అని అడిగింది. దానితో తండేల్ రిలీజ్ డేట్ చూసుకోమని చెప్పాను అన్నారు ఆయన. దానికి చైతు నా ఫేస్ గెడ్డం లేకుండా శోభిత ఎప్పుడు చూడలేదు అందుకే అడిగింది అన్నారు. నిన్ను గెడ్డం ఎపుడు తీస్తావ్ అని అడిగితె నా చేతుల్లో ఏమి లేదు అని ఉంటావ్ అందుకే శోభిత నన్ను అడిగింది అన్నారు అరవింద్.
అంతేకాదు రేపు మీమ్స్ చూడండి.. అల్లు అరవింద్ ని చైతు విషయంలో నిలదీసిన శోభిత అంటూ వేస్తారు అని అల్లు అరవింద్ ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సరదాగా వైరలయ్యాయి.