ఆరోజు చిరంజీవిని జగన్ మోహన్ రెడ్డి అవమానించారు అంటూ చిన్న వీడియో క్లిప్ ని ప్లే చేస్తూ తెగ రచ్చ చేశారు.. మరి జగన్ చిరంజీవికి రాగి ముద్ద-నాటుకోడి పెట్టి శాలువా కప్పి సన్మానిస్తే అది ఎవ్వరూ మట్లాడలేదు. అదే పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో చిరంజీవి గారిని అవమానించారంటూ గోల చేసారు.
మీరు లోపల లోపల మాట్లాడుకుని బయట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా, అధికారం కోసం అసలు మర్యాద పూర్వకంగా కలిసిన దాన్ని కూడా ఎంతో రాజకీయం చేశాడు పవన్ కళ్యాణ్. ఒక పక్క నీ తమ్ముడు అంత రాద్దాతం చేస్తుంటే.. లేదు అలా జరగ లేదు అని చెప్పాల్సింది పోయి ఇంత నిస్సిగ్గుగా ఎలా ఉన్నావ్ చిరు, మీది కాదులే తప్పు ఆరోజు మిమ్మల్ని ఇంటికి పిలిచి మర్యాద చేసి పంపించాడు చూడు మా జగనన్న ది తప్పు!! అంటూ జాఫర్ ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్యెల్యే కేతిరెడ్డి మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ తెగ ప్రచారం చేస్తుంది.
పవన్ కళ్యాణ్ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి హైడ్రా ఉసికొల్పితే తమ ఆస్తులను కొల్లగొడతాడని భయం. అదే జగన్ అయితే అలా జరగదు, ఆయ్ననైతే ఏమైనా అనొచ్చు అంటూ కేతి రెడ్డి మెగాస్టార్ చిరు, పవన్ కళ్యాణ్ విషయంలో ఫైర్ అవుతున్నాడు.