సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 2025 ఆరంభంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లక్కీ గర్ల్ మీనాక్షి చౌదరి ఆ సక్సెస్ ని దుబాయ్ వేదికగా ఎంజాయ్ చేసింది. 2025 లో ఫస్ట్ ట్రిప్ అంటూ దుబాయ్ వెళ్లిన ఈ భామ అక్కడేలా ఎంజాయ్ చేసిందో ఫొటోస్ రూపంలో సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అందరితో పంచుకుంది.
దుబాయ్ వెకేషన్స్ ముగించుకున్న మీనాక్షి చౌదరి అక్కడ నుంచి శ్రీశైలం కి వెళ్ళింది. శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకుని మల్లన్న సేవలో తరించింది. అక్కడ ఫోటోలకు ఫోజులిచ్చింది. అది చూసిన నెటిజెన్స్ దుబాయ్ వెకేషన్ నుంచి శ్రీశైలం శివుడు వద్దకు మీనాక్షి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత ఎలాంటి సినిమాలతో వస్తుంది. ఏ హీరోలతో ఆమెకి ఛాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.