దర్శకుడు బాబీ కి నిజంగా లక్కే లక్కు అని చెప్పాలి. మెగాస్టార్ చిరు, బాలయ్య లతో బ్యాక్ టు బ్యాక్ సీనియర్ హీరోలను లైన్ లో పెట్టి సినిమాలు చేసి హిట్స్ కొట్టిన బాబీ మరోసారి మెగా ఆఫర్ అందుకున్నాడనే న్యూస్ మెగా ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసింది. వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ చిరు కి హిట్ ఇచ్చిన బాబీ, బాలయ్య కు డాకు మహారాజ్ తో సక్సెస్ అందించాడు.
డాకు తర్వాత బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి మొదలు కాగా.. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లోనే బాబీ కి మెగా ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడని, చిరు విశ్వంభర, అనిల్ రావిపూడి చిత్రాలు తర్వాత బాబీ తో సినిమా చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఈలోపు మరో హీరోతో సినిమా చేస్తాడో లేదంటే చిరు కోసం స్క్రిప్ట్ ని డెవెలప్ చేసుకుంటూ కూర్చుంటాడో అనేది కాస్త సస్పెన్స్.