శోభితతో ప్రేమ విషయంలో నాగ చైతన్య చాలా సీక్రెట్ ని మైంటైన్ చేసాడు. పెళ్లి కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితులు నడుమ సింపుల్ గా చేసుకున్న నాగ చైతన్య-శోభితలు ప్రముఖుల కోసం రిసెప్షన్ కూడా ఇవ్వలేదు. పెళ్లి తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయినా రీసెంట్ గా మాల్దీవులకు హానిమూన్ ట్రిప్ వేసింది ఈ జంట.
తాజాగా తండేల్ ప్రమోషన్స్ లో నాగ చైతన్య శోభిత తో వైవాహిక బంధం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వైజాగ్ అల్లుడిని, ఇంట్లో రూలింగ్ పార్టీదే పై చెయ్యి అంటూ సరదాగా కామెంట్స్ చేసిన చైతు తాను శోభితతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను, మా పెళ్ళై కొన్ని నెలలే అయ్యింది. ఆ సమయంలో ఇద్దరం సినిమాలు చేస్తున్నా.. మాకంటూ సమయాన్ని కేటాయించుకుంటున్నాము.
వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, మా ఇద్దరిలో ఉన్న లక్షణం అదే కావడం విశేషం. సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేము. లైఫ్ పై మాకెంతో ఇంట్రెస్ట్ ఉంది. అది కూడా మమ్మల్ని కలపడంలో దోహదపడింది. మాకు ట్రిప్స్ వెయ్యడం ఇష్టం, ట్రావెలింగ్ ఇష్టం, ఫ్యూచర్ లో శోభిత నేను కలిసి సినిమా చేస్తామేమో ఇప్పుడే చెప్పలేము అంటూ నాగ చైతన్య శోభిత తో లైఫ్ గురించి అభిమానులతో షేర్ చేసుకున్నాడు.