Advertisementt

విజయసాయి లోటును వైసీపీకి తీర్చేదేవరు

Fri 31st Jan 2025 09:41 AM
sai reddy  విజయసాయి లోటును వైసీపీకి తీర్చేదేవరు
Vijayasai deficit will not be met by YCP విజయసాయి లోటును వైసీపీకి తీర్చేదేవరు
Advertisement
Ads by CJ

సాయిరెడ్డి లోటును ఢిల్లీలో తీర్చేదేవరు?

విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తర్వాత వైసీపీకి పెద్ద చిక్కు వచ్చే పడింది. ఇన్నాళ్లు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన.. ఢిల్లీలో అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ చక్కబెట్టిన వ్యక్తి సాయిరెడ్డి. ఆయన ఎందుకు రాజీనామా చేశారు..? పార్టీలో అంతర్గత పోరుతో పక్కకు వెళ్ళిపోయారా..? లేకుంటే ఇంతకు మించి సాయిరెడ్డికి జగన్ ఏమైనా టాస్క్ ఇచ్చారా..? అనేది తెలియట్లేదు. కానీ ఇప్పుడు పార్టీలో సాయిరెడ్డి స్థానం ఎవరిది..? ఇటు పార్టీలో.. అటు ఢిల్లీలో ఈ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? ఇప్పుడిదే సమాధానం దొరకని పెద్ద ప్రశ్నగా మారింది.

నాడు కేవీపీ.. నేడు విజయసాయి!

వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ ఉద్యోగం నుంచి ప్రస్థానం మొదలుపెట్టి రాజ్యసభ వరకూ ఎదిగారు. ఫ్యామిలీకి కష్టాల్లో, నష్టాల్లో అన్ని సమయాల్లోనూ అండగా నిలబడుతూ ఆఖరికి జగన్ రెడ్డితో కలిసి జైలు జీవితం కూడా పంచుకోవాల్సి వచ్చింది. దీంతో అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా, అంతకు మించి నీడలా, ఇంకా చెప్పాలంటే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలానో.. నిన్న మొన్నటి వరకూ జగన్ రెడ్డికి విజయసాయి ఆత్మగా వ్యవహరించారు. రాజకీయంగా విజయాన్ని అందించడంలో పాటు, ఢిల్లీ వేదికగా ఎలాంటి విషయాలనైనా సరే చక్కబెడుతూ వచ్చారు. ఎంతలా అంటే ఇంతవరకూ జగన్ అక్రమాస్తుల కేసుల ఫైల్ ముందుకు కదలకపోవడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అయ్యి చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర మంత్రుల నుంచి ప్రధాని మోదీ ఇంకా అగ్రనేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోదీ, అమిత్ షాలను ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే కలిసేవారు అని చెబుతుంటారు. అంతలా ఆయన లాబీయింగ్ అలా ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీకి ఢిల్లీలో ఇక గుర్తింపు అనేది తీసుకొచ్చింది సాయిరెడ్డినే.

ఇక అన్నీ ఈయనేనా..?

ఇప్పుడు సాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా జగన్‌కు తెలిసివస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి కొత్త వ్యూహాలు, సరైన నాయకత్వం అవసరమని రాజకీయ విశ్లేషకులు, అధినేత భావిస్తున్నారు. వాస్తవానికి సాయిరెడ్డి తర్వాత ఢిల్లీ వ్యవహారాలన్నీ జగన్‌కు ఆత్మీయ మిత్రుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూడబోతున్నారని అని తెలిసింది. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రెండుసార్లు ఎంపీగా గెలిచిన అనుభవం, పార్టీలో నేతల మధ్య విభేదాలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. రాయలసీమ, గోదావరి జిల్లాల్లో వ్యవహారాలన్నీ చూసుకున్నారు. ఎవరినైనా సరే లీడర్లు అసంతృప్తిగా ఉన్నారంటే చాలు.. ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయి పరిష్కారమార్గం చూపేవారు. అందుకే ఇప్పుడిక సాయిరెడ్డి స్థానాన్ని మిథున్ రెడ్డికి అప్పగించాలని వైఎస్ జగన్ రెడ్డి ఆలోచనలో ఉన్నారని తెలిసింది. 

ఈయన తప్ప వేరొకరు కూడా కష్టమే. సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ అంతేమీ కాదు. ఇక ఉన్న ఎంపీలు అందరూ అంతత మాత్రమే. వీరందరి కంటే సీనియర్ కావడం, వ్యవహారాలు చక్కబెట్టే నేత కావడంతో మిథున్ రెడ్డికి సాయిరెడ్డి స్థానం ఇవ్వబోతున్నారని తెలిసింది.

Vijayasai deficit will not be met by YCP:

Who will meet Sai Reddy deficit in Delhi

Tags:   SAI REDDY