కొద్దిరోజులుగా జనసైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలు పెట్టారు. అటు టీడీపీ అభిమానులు లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాలని రెచ్చిపోతుంటే, ఇటు జనసైనికులు పవన్ కళ్యాణ్ ను సీఎం అవ్వాలంటూ నినాదాలు మొదలు పెట్టారు.
ఒకొనొక సమయంలో పవన్ ని టీడీపీ నేతలు కించపరుస్తున్నారు అంటూ గోల పెట్టారు. చంద్రబాబు ఏపీ రాజకీయాల నుంచి తప్పుకుని పవన్ ను సీఎం ని చేసి లోకేష్ ని డిప్యూటీ సీఎం ను చేస్తారు అంటూ సోష మీడియాలో జరిగే ప్రచారానికి, జనసైనికుల దూకుడుకి పవన్ కళ్లెం వేశారు.
ఇకపై ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో ఎలాంటి ట్వీట్లు వెయ్యొద్దని, జరగాల్సిన సమయంలో అన్ని జరుగుతాయని పవన్ చెప్పడంతో గత రెండుమూడు రోజులుగా జనసైనికులు నోటికి తాళం వేసున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ లు కూడా పెట్టడం లేదు.