డిసెంబర్ 5 న విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్ప2 ద రూల్ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అవడమే కాదు.. 1900 కోట్ల కలెక్షన్స్ తో రికార్డులు తిరగరాసింది. సినిమా విడుదలైన నెలన్నరకు మరో 20 నిమిషాల నిడివి జోడించడంతో పుష్ప 2 కి రిపీటెడ్ ఆడియన్స్ రావడంతో కల్లెక్షన్స్ మరింత పెరిగాయి.
ఇక సినిమా విడుదలై రెండు నెలలవుతున్నా పుష్ప 2 ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ నడుస్తుంది. నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 న అన్ని భాషల్లో డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఎప్పుడెప్పుడు పుష్ప 2 ఓటీటీలో విడుదల చేస్తారో అని ఫ్యామిలీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
తాజాగా నెట్ ఫ్లిక్స్ పుష్ప2 ద రూల్ ఓటీటీ డేట్ లాక్ చేసింది. ఈ నెల 30 అంటే జనవరి 30 మరో మూడు రోజుల్లో పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వనున్నట్లుగా ప్రకటించారు. మరి థియేటర్స్ మిస్ అయిన వారు పుష్ప 2 ని ఓటీటీలో వీక్షించేందుకు రెడీ అవ్వండి మరి.