మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఇచ్చినందుకు జగన్ ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం రిలాక్స్ అవుతున్నారు. వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. రీసెంట్ గా టీడీపీ లీడర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
రఘురామ కృష్ణం రాజు జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ జరపక్కర్లేదు అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆల్రెడీ జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని.. దీనిలో మరో కోర్టు జోక్యం అక్కర్లేదు అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు అని, ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని పేర్కొంది. దానితో రఘురామ తరుపు లాయర్ తమ పిటిషన్ ను ఉపసంహరించుకోవడంతో జగన్ కు భారీ ఊరట లభించింది