ఈమధ్యనే గ్లామర్ గర్ల్ జాన్వీ కపూర్ తన పెళ్లి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాను తిరుపతిలో పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలను కనీ, భర్తకు సేవ చేసుకుంటూ అరిటాకులో భోజనం చేస్తూ గోవింద నామ స్మరణలో ఉండిపోవాలనుంది అంటూ జాన్వీ కపూర్ పెళ్లి పై తన మనసులో మాట బయటపెట్టింది.
తాజాగా ఆమె చెల్లి ఖుషి కపూర్ కూడా పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసింది. ఖుషి కపూర్ నటించిన లవ్ యాపా ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లిపై కామెంట్స్ చేసింది. తాను చిన్నప్పటి నుంచి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని, మా అక్క చెప్పినట్టే నాకు తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని కోరిక, నేను ముంబైకి చెందిన అమ్మాయిని. పెళ్లి తర్వాత మా నాన్న బోని కపూర్ నాతోనే ఉండాలనుకుంటున్నాను.
మా నాన్న మేము ఉండే బిల్డింగ్ లోనే ఉండాలని కోరిక. నేను నా భర్త, ఇద్దరు పిల్లలు, ఎక్కువ పెంపుడు కుక్కలు, ఇలా నా లైఫ్ ఉండాలని కోరుకుంటాను అని చెప్పగా.. మీరు కూడా మీ భర్తకు మీ అక్క చెప్పినట్లుగా సేవ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, నేను అలాసేవ చెయ్యలేను అంటూ ఖుషి కపూర్ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.