మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సమయంలో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్‌ను పొందింది. కలెక్షన్లలో సాధారణ విజయాన్ని సాధించినప్పటికీ టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. దీంతో రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC 16 పై ఎక్కువ దృష్టి పెట్టారు.
RC 16 చిత్రాన్ని బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఒక ముఖ్యమైన అప్‌డేట్ మేరకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర సినిమా మొత్తం సుమారు ఐదు నిమిషాల పాటు ఉంటుంది అని తెలిసింది. రణ్ బీర్ కపూర్ ఈ పాత్రను ఒప్పుకోవడానికి ఆయనకు కథ వివరించి ఒప్పించారని కూడా సమాచారం.
ఇక రణ్ బీర్ కపూర్ యనిమల్ సినిమా ద్వారా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఈ వార్త నిజమైతే RC 16 సినిమా బాలీవుడ్, తెలుగు పరిశ్రమలో మంచి మార్కెట్ క్రియేట్ చేయడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి భారీ యాక్షన్ సన్నివేశాలు, పటిష్ట కథ తప్పనిసరిగా ఉండాలి. బుచ్చిబాబు ఈ అంశాలను ఎంతవరకు రాణిస్తారో చూడాలి.