సూపర్ స్టార్ మహేష్-రాజమౌళి కాంబో చిత్రమైన SSMB 29 అఫీషియల్ గా మొదలైపోయింది. జనవరి 2 న పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఈ శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. మహేష్ ని ఎక్కడికి పోనివ్వకుండా రాజమౌళి బందించేసారు. ఇక ఈచిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుంది. అది హీరోయిన్ పాత్రా లేకుంటే కీలక పాత్ర అనేది క్లారిటీ లేదు.
అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను ఈ గ్లోబల్ బ్యూటీ భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందట. కొన్నేళ్లుగా ఇండియా లో నటించని ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీస్, సీరీస్ లోచేస్తుంది. ఆ రేంజ్ తోనే ప్రియాంక చోప్రాకు SSMB 29 మేకర్స్ 25 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నారట .
మరి ఇప్పటివరకు ఓ హీరోయిన్ సౌత్ లో ఈ రేంజ్ పారితోషికం అందుకోవడం మాములు విషయం కాదు. కల్కి కోసం దీపికా పదుకొనె కి 20 కోట్లు నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు SSMB 29 కోసం ప్రియాంక చోప్రాకు ఏకంగా 25 కోట్లు ముట్టజెబుతున్నారట. అంతేకాకుండా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమెకు స్పెషల్ చెల్లింపులు ఉంటాయట, అంటే హోటల్ రూమ్, ఫుడ్ వగైరా వగైరా అన్నమాట.
సో ఈ లెక్కన గ్లోబల్ బ్యూటీ పారితోషికం చూసాక SSMB 29 రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.