తమిళనాట హీరో విజయ్ పార్టీ పెట్టి అక్కడి స్టాలిన్ ప్రభుత్వానికే కాదు, బీజేపీ ప్రభుత్వానికి కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్న విజయ్ మరో ఏడాదిలో పూర్తిస్థాయి పొలిటికల్ లీడర్ గా మారబోతున్నాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో తన పార్టీ ని బలంగా తయారు చేసేందుకు విజయ్ పావులు కదుపుతున్నారు.
ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా కళల రంగానికి గాను హీరో అజిత్ కు పద్మ భూషణ్ ప్రకటించారు. దానితో అజిత్ ఏ రకంగా పద్మ భూషణ్ కు అర్హుడు అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే అజిత్ కి పద్మభూషణ్ ఇవ్వడం వెనుక బీజేపీ ప్రభుత్వం విజయ్ ని రెచ్చగొట్టడమే అనే మాట కూడా వినవస్తుంది.
విజయ్ ఏవో సేవా కార్యక్రమాలు అంటూ చేస్తున్నారు తప్ప అజిత్ అలాంటివేం చేసిన దాఖలాలు లేవు, అసలు అజిత్ కే ప్రత్యేకంగా ఇలా పద్మభూషణ్ ఇవ్వడం వెనుక బీజేపీ ఆంతర్యం మాత్రం విజయ్ ని కెలకడానికే అంటున్నారు. మరి విజయ్ బీజేపీ తో కలిసి పని చేసేవరకు బీజేపీ ఇలాంటివే చేస్తుందేమో చూడాలి. ఏదైనా పద్మ అవార్డులు మాత్రం విజయ్ అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసాయి.