మహేష్-రాజమౌళి కాంబో మూవీ అప్ డేట్ ని రాజమౌళి చాలా తెలివిగా ప్లాన్ చేసారు. జనవరి 2 న గుట్టుచప్పుడు కాకుండా SSMB 29 పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా సింహాన్ని బందించి దాని పాస్ పోర్ట్ ని సీజ్ చేసినట్టుగా రాజమౌళి ఇచ్చిన అప్ డేట్ చూసి మహేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. మహేష్ ఇకపై ఎక్కడికి వెకేషన్స్ కి వెళ్లకుండా రాజమౌళి బందించినట్లుగా ఆ వీడియో ఉంది.
ఇక మహేష్ కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రిప్లై ఇవ్వడం అన్ని SSMB 29 పై క్రేజ్ ను పెంచేసాయి. అయితే ఈచిత్రంలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది అనే ప్రచారం ఉండడం, ప్రియాంక చోప్రా హైదరాబాద్ లోనే కనిపించడంతో మహేష్ సరసన SSMB 28 లో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని ఫిక్స్ అయ్యారు.
కానీ ఆమె హీరోయిన్ కాదు, ఈ చిత్రంలో ప్రియాంక ఓ కీ రోల్ పోషిస్తుంది, మహేష్ కి హీరోయిన్ వేరే ఉంది అనగానే మహేష్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. కారణం మహేష్ పక్కన ప్రియాంక చోప్రా పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది అనేది వారి దిగులు. కానీ ఇప్పుడు ప్రియాంక హీరోయిన్ కాదని వస్తున్న వార్తలతో వారు రిలాక్స్ అవుతున్నారు.
మరి ఈ విషయంలో రాజమౌళి స్పందన ఎలా ఉందొ కానీ.. మహేష్ కోసం ఓ హాలీవుడ్ హీరోయిన్ ని రాజమౌళి దించబోతున్నారు, ఇప్పటికే దానికి సంబందించిన ఆడిషన్స్ కూడా జరిగాయనే టాక్ వినబడుతుంది.