విజయ్ సాయి రెడ్డి జగన్ కు మేలు చెయ్యడానికే రాజకీయ సన్యాయం చేసారా.. ఇదెక్కడి విచిత్రమండి, జగన్ కోసం విజయ్ సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడమేమిటో.. ఆ విషయమే బ్లూ మీడియా బల్లగుద్ది మరీ చెబుతుంది. విజయ్ సాయి రెడ్డిని బిజెపి, కూటమి ప్రభుత్వం బెదిరించింది. పాత కేసులన్నీ తిరగదోడుతాం, మీరు గనక జగన్ కేసుల విషయంలో అప్రూవర్ గా మారితే మీకు ఎలాంటి హాని చెయ్యము అంటూ విజయ్ సాయి రెడ్డిని ప్రలోభ పెట్టారా.
పెట్టారని బ్లూ మీడియా చెబుతుంది. కానీ విజయ్ సాయి రెడ్డి జగన్ కు ద్రోహం చెయ్యలేకే ఆయన రాజకీయ సన్యాసం చేసారు, జగన్ పేరుని ఇరికించలేకే సాయి రెడ్డి రాజీనామా, ఇదన్నమాట సాయి రెడ్డి రాజీనామా వెనుక సీక్రెట్ అంటూ బ్లూ మీడియా ఊదరగొడుతుంది. కేవలం లెక్కకు మించి ఆస్తుల కేసులే కాదు, వైసీపీ పాలనలో చాలా రకాల అవినీతి మరకలు సాయి రెడ్డి మీద పడేందుకు సిద్దమైన సమయంలో విజయ్ సాయి రెడ్డి సైలెంట్ గా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి తన మార్గం సులువు చేసుకుని కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించేసారు.
మరి జగన్ కు ఇది నిజంగా దిమ్మతిరిగే షాకే. కలలోనైన కలగనలేదే అన్నట్టుగా ఉండి ఉంటుంది జగన్ పరిస్థితి. విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి జగన్ ఎప్పటికి కోలుకుంటాడో కాని.. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మాత్రం అయోమయంలో ఉంది. ఇది కవర్ చెయ్యడానికే సాయి రెడ్డి జగన్ కు భలే సహాయం చేసారు అంటూ బ్లూ మీడియా వార్తలు వండి వారిస్తుంది.