ఉప్పెన చిత్రంతో బేబమ్మ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి ఆతర్వాత రెండుమూడు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఆతరవాత మాత్రం ప్లాప్ హీరోయిన్ గా మారిపోయింది. వరస సినిమాలు బేబమ్మ కు షాకిచ్చాయి. మరోవైపు తమిళంలో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న కృతి శెట్టి అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగులో అడుగుపెడుతుంది.
అనుకున్న అవకాశాలు తలుపు తట్టకపోయినా కృతి శెట్టి సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతుంది. అందుకే తన గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ దర్శకనిర్మాతల చూపు తనపైన పడేలా చూసుకునే పనిలో బిజీగానే ఉంది. ట్రెడిషనల్ నుంచి గ్లామర్ వైపు టర్న్ అయ్యింది ఈ క్యూటీ.
తాజాగా వదిలిన పిక్స్ లో స్పెషల్ ఏమి లేకపోయినా.. సింపుల్ గా క్యూట్ గా కనిపించింది. అది చూసి బ్యూటిఫుల్ కృతి శెట్టి అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.