హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పటివరకు గ్లామర్ డాల్ గానే ప్రొజెక్ట్ అయ్యింది. కారణం ఆమె చేసిన పాత్రలే. అందాల ఆరబోతలో నిధి అగర్వాల్ బాలీవుడ్ కల్చర్ ను ఫాలో అవుతుంది. ఇప్పుడు నిధి అగర్వాల్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన పవన్ తో హరి హర వీరమల్లు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ చిత్రాలను చేస్తూ క్రేజీగా మారింది.
తాజాగా ఆమె రాజాసాబ్ లోని తన పాత్ర పై స్పందించింది. ఆడియన్స్ నా నుంచి ఎక్కువగా గ్లామర్ పాత్రలనే కోరుకుంటారు, నేను కూడా అలాంటి పాత్రలనే ఎంచుకుంటాను అనుకుంటారు. రాజా సాబ్ చిత్రంలో నా పాత్ర చూసి నాపై అందరూ తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. నేను అది పక్కాగా చెప్పగలను.
రాజా సాబ్ లో నా పాత్ర రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు డిఫ్రెంట్ గా ఉంటుంది. నా పాత్రను ఆడియన్స్ ఎవరూ గెస్ చెయ్యలేరు. అందరిని నా పాత్ర షాక్ కి గురి చేస్తుంది అంటూ రాజా సాబ్ లోని తన పాత్రపై నిధి అగర్వాల్ హైప్ క్రియేట్ చేసింది.