నందమూరి బాలకృష్ణ కు కళల రంగానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం పద్మభూషణ్ అవార్డు ను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా రంగంలోని పలువురకు పద్మ అవార్డులను, బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించారు.
బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ కు అభినందనల వెల్లువలు మొదలయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాల బాబాయ్ కి అబ్బాయి తారక్, కల్యాణ్ రామ్ లు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసారు.
ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనం అంటూ తారక్ వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.