Advertisementt

పద్మ అవార్డులు.. ప్రకటన

Sat 25th Jan 2025 08:16 PM
padma awards  పద్మ అవార్డులు.. ప్రకటన
Padma Awards.. Vibhushan to Balayya పద్మ అవార్డులు.. ప్రకటన
Advertisement
Ads by CJ

రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో 30 పద్మశ్రీ అవార్డులు వరించగా, మరికొందరికి పద్మ భూషణ్, ఇంకొందరికి పద్మ విభూషణ దక్కింది. ఇందులో మన తెలుగు తేజం నందమూరి బాలకృష్ణ ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు. 

పద్మ శ్రీ అవార్డులు వీరికే..

జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు, బ్రెజిల్‌), హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌, హరియాణా), భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌, బిహార్‌), పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు, పుదుచ్చేరి), ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు, నాగాలాండ్‌), బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు, మధ్యప్రదేశ్‌), షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా, కువైట్‌), నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు, నేపాల్‌), హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు, హిమాచల్‌ ప్రదేశ్‌), జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త, అరుణాచల్‌ ప్రదేశ్‌), విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు, మహారాష్ట్ర), వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు, కర్ణాటక), నిర్మలా దేవి (చేతి వృత్తులు, బిహార్‌), జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు, అస్సాం), సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు, గుజరాత్‌), రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త, ఉత్తరాఖండ్‌), పాండి రామ్‌ మాండవి (కళాకారుడు, ఛత్తీస్‌గఢ్‌), లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు, గోవా), గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు, పశ్చిమ బెంగాల్‌), సాల్లీ హోల్కర్‌ (చేనేత, మధ్యప్రదేశ్‌), మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య, మహారాష్ట్ర), బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి, రాజస్థాన్‌), వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు, తమిళనాడు), భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట, కర్ణాటక), పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత, గుజరాత్), విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం, కర్ణాటక), చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ, మహారాష్ట్ర), జగదీశ్‌ జోషిలా (సాహిత్యం, మధ్యప్రదేశ్‌), నీర్జా భట్లా (గైనకాలజీ, న్యూఢిల్లీ), హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌,ఉత్తరాఖండ్‌).

పద్మ విభూషణ్, పద్మ భూషణ్‌లు ఇలా..

హీరో కమ్ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌, నటి వైజయంతి మాలకు పద్మవిభూషణ్‌, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌లకు పద్మభూషణ్ అవార్డులను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటన చేసింది. 

Padma Awards.. Vibhushan to Balayya:

Padma awards 2025 announced

Tags:   PADMA AWARDS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ