విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ విలవిల్లాడుతోంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో నేతలు, కార్యకర్తలకు అర్థంకాక గిల గిల కొట్టుకుంటున్నారు. పార్టీ మనుగడపై లేని పోనీ సందేహాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియాలో కొందరు వైఎస్ జగన్ వీరాభిమానులు, కార్యకర్తలు కవరింగ్ చేయడానికి తెగ హడావుడి చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించిన సొంత చెల్లే గుండెల మీద కొట్టింది.. అంతకంటే పెద్ద బాధ ఏమి ఉంటుంది జగనన్నకు..? ఆయన నమ్ముకుంది కార్యర్తలను.. ప్రజలను మాత్రమే..! ఆయనకి ఎప్పటికీ అండగా ఉండాల్సింది కార్యకర్తలు, అభిమానులు మాత్రమే..ఇదే శాశ్వతం..! కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో కవరింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరికొన్ని..!
విజయ సాయిరెడ్డి రాజీనామా నిజంగా వైసీపీకి పెద్ద కుదుపే కానీ ఆట ఇంతటితో ఐపోలేదు.. ఆగిపోలేదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఎదురు దెబ్బలు ఇంకా చాలా తగలబోతున్నాయి. నాయకులు ఎంత మంది పోయినా జగన్ రెడ్డిని జనాలు వదలరు, ఆయన్ను ప్రాణంగా ప్రేమించే కోట్లాది మంది జనాలు ఉన్నంతవరకు ఇలాంటి కుదుపులకు భయపడాల్సిన పనిలేదు. పార్టీకి ఇద్దరే శాశ్వతం. అందులో ఒకరు వైఎస్ జగన్, ఇంకొకరు కార్యకర్త అంతే. ప్రతి ఒక్కరు ఇది మనసులో పెట్టుకోండి! అంతే అంటూ మరికొందరు నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో నెలకొన్న అసంతృప్తి, కొందరిపై ఉన్న ఆగ్రహ ఆవేశాలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎందరో.. ఇంకెందరో..!
వంగవీటి రాధా అయినా, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగామ సురేష్ ఆఖరికి విజయసాయిరెడ్డి అయినా.. ఇలా ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళని క్యాడర్ లేపింది అంటే వాళ్ళంతా జగన్‌తో అడుగులు వేస్తున్నారనే తప్ప వాళ్లకేం సొంతగా ఏమీ లేదు. జగనే అంటేనే వైసీపీ.. వైసీపీ అంటేనే వైఎస్ జగన్ అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. జగన్ మోహన్ రెడ్డి పార్టీలో నుంచి నాయకులు వెళ్లినంత మాత్రాన ఆయనకు కొత్తగా వచ్చే నష్టం లేదు. 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, వైసీపీ చీల్చినా జగన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమీ లేదు. జీరోతో మొదలై మళ్ళీ జీరోకి చేరుతారు అంతే కదా. రేపు పొద్దున్న పరిస్థితులు మారవచ్చు. ఐనా ప్రతిసారి ఎన్నికలకు కొత్త అభ్యర్ధులు వైపు చూసే జగన్ రెడ్డికి ప్లస్ అవుతుందే తప్ప మైనస్ కానే కాదని కొందరు అభిమానులు ఏడ్వలేక పోస్టులు పెడుతున్న పరిస్థితి.