సమంత చాలా రోజులుగా సినిమాలు అందులోను సౌత్ సినిమాలపై అస్సలు దృష్టి పెట్టడం లేదు. మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత విజయ్ దేవరకొండ తో ఖుషి చిత్రం మాత్రమే చేసిన సమంత ఆ తర్వాత వెబ్ సీరీస్ లను మాత్రమే ఎంచుకుంటుంది. ఇప్పటికే సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 షూట్ కంప్లీట్ చేసింది.
ఇక రాజ్ అండ్ డీకే ద్వయంతో మరో వెబ్ సీరీస్ చేస్తుంది. తాజాగా సమంత వరసగా రాజ్ అండ్ డీకే తో కలిసి పని చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. రాజ్ అండ్ డీకే లు ఎక్కువ సవాల్ తో కూడుకున్న పాత్రలనే రూపొందిస్తున్నారు. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలను రూపొందిస్తున్నారు, వారితో పని చేస్తే చాలా సంతృప్తిగా ఉంటుంది. గొప్ప సినిమాలలో నటించాలి అనే భావన లేకపోతే పని చేయలేము.. అంటూ సమంత చెప్పుకోచ్చింది.
అయితే అలా మాట్లాడడంపై సౌత్ ఆడియన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నిన్ను స్టార్ హీరోయిన్ ను చేసింది సౌత్ దర్శకనిర్మాతలు. నువ్వు ఇక్కడే స్టార్ గా ఎదిగి హిందీకి వెళ్ళావు. రెండు మూడు సీరీస్ లు చేసేసరికి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో ఆలోచించు అంటూ ఆమెకి సలహాలు ఇస్తున్నారు.