పుష్ప 2 ద రూల్ సినిమా విడుదలై 50 రోజులు పూర్తయ్యింది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2000 కోట్లకు దగ్గరగా చేరిన పుష్ప ద రూల్ కలెక్షన్స్‌తో అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప 2ని నార్త్ ఆడియన్స్ ఎంతలా ఆదరించారంటే.. నార్త్ లోనే రూ. 1000 కోట్లు కలెక్షన్స్ ఇచ్చి.. ఫైర్ చూపించారు.
మరి థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప 2 ఓటీటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్‌లో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. ఈ నెల 31 నుంచి పుష్ప ద రూల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే టాక్ నడిచింది. కానీ మేకర్స్ మాత్రం పుష్ప 2 ఓటీటీ డేట్‌పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
పుష్ప 2ని అన్ని భాషల్లోనూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేశారు. మరి సినిమా విడుదలైన 60 రోజులకేమైనా పుష్ప 2 నెట్ ఫ్లిక్స్‌కి వస్తుందో లేదంటే.. ఇంకా టైమ్ తీసుకుంటుందో.. అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నమాట. ఇంతకు ముందు ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు.. విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే అని నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.